Karkanagaraju : జస్టిస్ బిఆర్ గవాయ్ పై జరిగిన దాడి అమానుషం

TRINETHRAM NEWS

ఇది సాక్షాతూ భారత రాజ్యాంగంపై దాడి

అల్ ఇండియా అంబేద్కర్ యువజన సంగం గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు కర్కనాగరాజు

కూకట్పల్లి అక్టోబర్ 9 (త్రినేత్రం న్యూస్) : ఇటీవల భారతదేశం సుప్రీంకోర్ట్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.ఆర్. గవాయ్ పై సుప్రీం కోర్టులో జరిగిన దాడి ఆందోళన కలిగించే అంశం మరియు తీవ్రంగా ఖండించవలసిన సంఘటన అని గ్రేటర్ హైదరాబాద్ అల్ ఇండియా అంబేద్కర్ యువజన సంగం అధ్యక్షులు కర్కనాగరాజు అన్నారు. ఈ సంఘటన మరువకముందే హర్యానా రాష్ట్రములో దళిత ఐ.పి.ఎస్ అధికారి ఉన్నతధికారుల వేధింపులను భరించలేక ఆత్మ చేసుకోవడం చాలా విచారకరం.దళితుల పై దాడులు, వేధింపులతో ప్రపంచం లో భారత్ నిజంగానే వెలిగిపోతుంది. న్యాయవ్యవస్థను ప్రతిబింబించే వస్త్రధారణలో ఉన్న న్యాయవాది, కోర్టులో ప్రధాన న్యాయమూర్తిపై చెప్పు విసరడం అనేది కేవలం వ్యక్తిపై దాడి కాదు ఇది న్యాయవ్యవస్థ గౌరవం, రాజ్యాంగ పరమాధికారం, ప్రజలకు న్యాయంపై ఉన్న నమ్మకంపై దెబ్బ అని కర్క నాగరాజు అన్నారు. ఇది ఒక్కసారిగా జరిగిన సంఘటన కాదు గవాయ్ షెడ్యూల్డ్ కులానికి చెందినవారు, ఈ అత్యున్నత పదవిని చేపట్టిన రెండవ దళిత వ్యక్తి ఈ నేపథ్యంలో ఈ దాడి వెనుక కుల ఆధారిత ద్వేషం ఉండొచ్చని విషయాన్ని విస్మరించలేం ఒక న్యాయమూర్తి అది దేశ సుప్రీం కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి పై కోర్టు రూమ్ లోనే ఇలాంటి అవమానం ఎదుర్కొనడం, రాజ్యాంగ విలువలను చెరిపేసే మత, కుల విద్వేషాలు ప్రమాదకర ధోరణిని సూచిస్తుంది అని తెలిపారు
ఒక న్యాయవాది తన మతభావాలకు రాజ్యాంగం, న్యాయవ్యవస్థ కంటే ఎక్కువ విలువ ఇవ్వడం అత్యంత ప్రమాదకరం. రాజ్యాంగం ప్రకారం ఎవరి విశ్వాసం, మతం లేదా భావోద్వేగం కూడా చట్టం కన్నా ఎక్కువ కాదు,మతపరమైన సిద్ధాంతాలకి ఎక్కువ విలువ ఉన్నచోట లౌకికత్వం, న్యాయస్వాతంత్ర్యం రెండూ ప్రమాదంలో పడతాయి అని అన్నారు.ఈ ఘటనపై తక్షణ కఠిన చర్యలు అవసరం. ఎస్సీ ఎస్టి చట్టం, కోర్టు ధిక్కార చట్టం ప్రకారం దర్యాప్తు, భద్రతా లోపాలపై విచారణ, వృత్తినిషేధం వరకు చర్యలు తీసుకోవాలి , దేశ బాహీష్కరణ చేయాలి లేకపోతే ప్రజా స్వామ్యం ప్రమాదం లో పడే అవకాశం వుంది. దళితల పై దాడులు దేశంలో ఎక్కడో ఒక చోట రోజు జరుతున్నాయి. రాష్ట్రపతి మరియు కేంద్ర ప్రభుత్వం వెంటనే దర్యాప్తు చేపట్టి దోషులను అత్యంత కఠినంగా శిక్షించాలని, భవిష్యత్తులో మరల ఎవరు ఈవిదంగా దాడులకు పాల్పడకుండా చూడాలని గ్రేటర్ హైదరాబాద్ అల్ ఇండియా అంబేద్కర్ యువజన సంగం తరపున కేంద్ర ప్రభుత్వాన్ని మరియు జాతీయ ఎస్సి కమిషన్ ను డిమాండ్ చేస్తున్నాము.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

attack on Justice BR Gavai

You cannot copy content of this page

Scroll to Top