త్రినేత్రం న్యూస్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. అశ్వారావుపేట నియోజకవర్గం దమ్మపేట మండలం నాగుపల్లి గ్రామంలో, గ్రామస్తులచే లక్ష్మీ నారాయణ స్వామి దేవాలయ ప్రాంగణంలో నిర్మించబడిన హరిహరాత్మజ అయ్యప్ప స్వామి పీఠం ప్రారంభోత్సవ మహోత్సవంలో ఎమ్మెల్యే జారే ఆదినారాయణ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామ ప్రజలు భక్తి భావంతో నిర్మించిన అయ్యప్ప స్వామి పీఠం ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తుందన్నారు. ఈ పీఠం ద్వారా చక్కని ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పీఠాధిపతులు, అయ్యప్ప స్వామి భక్తులు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


