త్రినేత్రం న్యూస్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలంలో ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా ములకలపల్లి పంచాయితీ లోని రాజుపేట కాలనీలోని చింతకాయల కుమారి, వెంకటేశ్వరరావు (కౌజుపిట్టల) యూనిట్ ను ప్రారంభించుకున్నారు. ఈ యొక్క యూనిట్ ను సెంట్రల్ నుండి వచ్చిన ఐఏఎస్ ఆఫీసర్ ,జిల్లా కలెక్టర్, ఐటిడిఏ పిఓ,అడిషనల్ కలెక్టర్ విద్యచందన విజిట్ చేసి. ఈ యూనిట్ను ఏర్పాటు చేసుకోవటం వలన, నెలకు ఎంత సంపాదిస్తారు. లోన్ ఎక్కడ నుండి తీసుకున్నారు. ఎంత EMI కడుతున్నారు. అని అడిగి తెలుసుకోవడం జరిగింది.
తదనంతరం చౌటిగూడెం గ్రామంలోకి తానం లత, రాజశేఖర్ ఏర్పాటు చేసుకున్న (పుట్టగొడుగుల) యూనిట్ ను సందర్శించి, ఈ యూనిట్ ఏర్పాటుకు శిక్షణ, విత్తన సేకరణ, ఎలా పెంచడం మరియు మార్కెటింగ్ ఎక్కడ నుండి వస్తుంధని ప్రశ్నించారు. శిక్షణ మహిళా సంఘాల ద్వారా ఖమ్మంలో తీసుకున్నాము. లోన్ సదుపాయం అంకిత మండల మహిళా సమాఖ నుండి రూ 3,00,000/- లోన్ తీసుకున్నాము అని టి.లత తెలియచేసినారు. అనంతరం మొగురాలగుప్ప, మూకమామిడి గ్రామములోని వెదురు నాటుకున్న రైతులను, సెంట్రల్ నుండి వచ్చిన అధికారులు మాట్లాడటం జరిగింది. ఈ కార్యక్రమంలో, సెంట్రల్ నుండి అధికారులు, జిల్లా కలెక్టల్, అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


