Korra Kishan Naik : డాక్టరేట్ పట్టా అందుకున్న కొర్ర కిషన్ నాయక్

TRINETHRAM NEWS

దేవరకొండ డివిజన్ అక్టోబర్ 06 త్రినేత్రం న్యూస్. సమాజంలో సమాచార హక్కు చట్టం పై ప్రజలు మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం మరింత పెరిగిందని సమాచార హక్కు చట్టం రక్షణ సమితి వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు కొర్ర కిషన్ నాయక్ అన్నారు. హైదరాబాదులో డే స్ప్రింగ్ థియోలాజికల్ యూనివర్సిటీ టెక్సాస్ యు ఎస్ ఏ వారు గౌరవ డాక్టరేట్ పట్టాను నల్లగొండ జిల్లా గుండ్లపల్లి (డిండి) మండలం కొత్త తండా కు చెందిన సమాచార హక్కు చట్టం రక్షణ సమితి వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు కొర్ర కిషన్ నాయక్ చేసిన సేవలను గుర్తించి ఘర్షణ శ్రీనివాస్ పుష్ప రాజశేఖర్ సినీ ప్రముఖుల చేతుల మీదుగా గౌరవ డాక్టరేట్ పట్టాను అందుకోవడం జరిగింది.

ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆర్.టి.ఐ సమాచార హక్కు చట్టం పై ప్రజలలో అవగాహన కల్పిస్తూ ప్రజల కోసమే రూపొందించబడిన ఆర్టిఐ పై ప్రజలలో మరింత మేలుకొలుపును పెంపొందించే దిశగా ముందుకు వెళుతున్న క్రమంలో ఇలాంటి గౌరవ డాక్టరేట్ ను అందించడం శుభ తరుణమని వారన్నారు. ఈ గౌరవ డాక్టరేట్ పట్టా అందుకోవడంతోపాటు మరింత బాధ్యత పెరిగిందని ప్రజలు ప్రభుత్వం రూపొందించిన చట్టాలను వినియోగించుకోవాలని ప్రతి ఒక్కరికి చట్టంలో ప్రశ్నించే అధికారం ఉందని ప్రజలు ప్రభుత్వ అధికారులు పనితీరులోనీ ప్రజల స్వంతమైన చట్టపరమైన అంశాలను ప్రజలు ఉపయోగించుకోవాలని వారు కోరారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Korra Kishan Naik receives doctorate degree

You cannot copy content of this page

Scroll to Top