MPTC ZPTC Candidates : అశ్వారావుపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ MPTC ZPTC అభ్యర్థుల దరఖాస్తుల స్వీకరణ

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్. 05.10.2025 – ఆదివారం. అశ్వారావుపేట నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల నుండి MPTC, ZPTC స్థానాలకు సంబంధించిన పోటీ చేయదలచిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను స్వీకరించేందుకు గండుగులపల్లిలో ఈరోజు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించబడింది ఈ కార్యక్రమం దమ్మపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మద్దిశెట్టి సత్యప్రసాద్,అధ్యక్షతన ముఖ్య అతిథులుగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పొదెం వీరయ్య మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు తోట దేవి ప్రసన్న ,TPCC జనరల్ సెక్రటరీ ధర్మారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ సమక్షంలో నాయకులు కార్యకర్తల నుండి పూర్తి వివరాలతో కూడిన దరఖాస్తులు స్వీకరించబడ్డాయి
ఈ కార్యక్రమంలో ఐదు మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహిళా కాంగ్రెస్ నాయకులు అనుబంధ సంఘ ప్రతినిధులు సేవాదళ్ నాయకులు సోషల్ మీడియా సభ్యులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Congress Party MPTC ZPTC Candidates Applications

You cannot copy content of this page

Scroll to Top