తెలంగాణ కళాకారులకు కేటీఆర్ అభినందనలు
టీ షర్టుల పైన జియోగ్రాఫికల్ ఇండికేషన్ (GI) చేర్యాల్ పెయింటింగ్ ని వేసిన తెలంగాణ కళాకారులు రాకేష్, వినయ్ లకి భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభినందనలు తెలిపారు. ఇలాంటి వినూత్నమైన పద్ధతుల వలన సాంప్రదాయ కళలకు మరింత డిమాండ్ వస్తుందని కేటీఆర్ అన్నారు. వీటికి మరింత ఆన్లైన్ మార్కెటింగ్, బ్రాండింగ్ అవసరం ఉన్నదని ఆయన అన్నారు. జియోగ్రాఫికల్ ఇండికేషన్ పొందిన చేర్యాల పెయింటింగ్ వంటి ఉత్పత్తులకు ప్రచారం వలన కళాకారులకు ఎంతో లబ్ధి చేకూరుతుందన్నారు. ఈరోజు రాకేష్ వినయ్ లు రూపొందించిన టీ షర్టులను తెలంగాణ భవన్ లో కేటీఆర్ ఆవిష్కరించారు.