CM Revanth Reddy : బతుకమ్మ కుంట ప్రారంభోత్సవం

TRINETHRAM NEWS

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగం

Trinethram News : ఆడబిడ్డలను మన సంతోషంలో భాగస్వాములను చేసినప్పుడే బతుకమ్మ పండుగ నిండుదనం.. వి. హనుమంతరావు గారు తన జీవితాశయంగా బతుకమ్మ కుంట కోసం పోరాడారు. హైడ్రా ఏర్పాటు చేసినపుడు కొంతమందికి అర్థం కాలేదు.. కొంతమంది అర్థమైనా కబ్జాలను కాపాడుకునే ప్రయత్నం చేశారు.. చాలా మంది మాపై చాలా విమర్శలు చేశారు .. ఒడిదుడుకులు వచ్చినపుడు సమయస్ఫూర్తితో పరిష్కరించుకుంటూ వెళ్లాలి.. కోవిడ్ తరువాత వాతావరణంలో విపరీతమైన మార్పులు వచ్చాయి.

మన వ్యవస్థ 2 సెంటీమీటర్ల వర్షాన్ని తట్టుకునేందుకు మాత్రమే ఏర్పాటు చేయబడ్డాయి.. కానీ ప్రస్తుతం ఒకేసారి కుంభవృష్టి కురుస్తున్న పరిస్థితి.. ఈ పరిస్థితులను ముందుగానే అంచనావేసి పర్యావరణ పరిరక్షణ, మౌలిక సదుపాయాల కల్పనకు ప్రణాళికలు రూపొందించుకున్నాం. ఒకప్పుడు జీవధారగా ఉన్న మూసీ ఇప్పుడు మురికి కూపంగా మారింది.. చెరువులను విడిపించడం, నాలాలను విస్తరించడం, మూసీ పునరుజ్జీవనం చేయడం మా ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుని పనిచేస్తున్నాం.. రాజకీయాలకు అతీతంగా మూసీపునరుజ్జీవానికి కలిసి రావాలి.. కొంత మందికి పేదరికం ఎక్స్ కర్షన్ లాంటిది.. కానీ మాకు అలా కాదు.

పేదరికం విలువ ఏమిటో నాకు తెలుసు.. వర్షం వస్తే గంటలో మూసీ పరివాహక కాలనీలు జలమయం అవుతున్నాయి.. భవిష్యత్ లో ప్రకృతి వైపరీత్యాలను తట్టుకునేలా మనం అభివృద్ధి చేసుకోవాలి.. అంబర్ పేట మూసీ పరివాహక ప్రాంతాల పేదలకు పునరావాసం కల్పించేందుకు క్షేత్ర స్థాయిలో పర్యటించి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని మా మంత్రి పొన్నం ప్రభాకర్ కు ఆదేశిస్తున్నా.. రాజకీయాలకు అతీతంగా అంబర్ పేటను అభివృద్ధి చేసేందుకు నేను సిద్ధంగా ఉన్నా.

హైదరాబాద్ నగరాన్ని అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేస్తాం… పేదలకు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా… మాయగాళ్లు మహానగరంలో చాలామంది ఉంటారు.. వాళ్ల ముఠా నాయకుడు ఇంకొకరు ఉండొచ్చు.. మాయమాటలు చెప్పి ప్రభుత్వ భూములను అగ్గువ సగ్గువకు అమ్మితే కొనకండి.. మాది ప్రజా ప్రభుత్వం.. ప్రజలెవరినీ మేం కష్టపెట్టం.. మా పేదలకు అండగా నిలబడుతుంది.. బతుకమ్మ కుంటకు వి.హనుమంతరావు పేరు పెట్టాలని స్థానిక ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ సూచించారు.. వారి సూచన మేరకు ఆ దిశగా ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశిస్తున్నా.. ఆనాడు హనుమంతరావు గారి సూచన మేరకే ప్రగతి భవన్ పేరును జ్యోతిరావు పూలే ప్రజా భవన్ గా మార్చాం.. ఆయన గౌరవానికి భంగం కలగకుండా వారి సలహాలు సూచనలు తీసుకుంటూ ముందుకెళ్తాం..

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Bathukamma Kunta inauguration

You cannot copy content of this page

Scroll to Top