AITUC : గట్టయ్య కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ఏఐటియుసి నాయకులు

TRINETHRAM NEWS

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఎఐటియుసి మాజీ అధ్యక్షులు కామ్రేడ్ వై గట్టయ్య పుట్టిన రోజు సందర్భంగా ఓసిపి 5 ఏఐటియుసి ప్రాజెక్టు కమిటీ నాయకులు గట్టయ్య ఇంటికి వెళ్ళి బర్త్ డే కేక్ కట్ చేయించి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. శనివారం గోదావరిఖని పవర్ హౌజ్ కాలనీ లోని గట్టయ్య ఇంటి వద్ద జరిగిన కార్యక్రమంలో నాయకులు మాట్లాడుతూ గట్టయ్య 1945 సెప్టెంబర్ 20 న మంథని దగ్గర లోని గుంజపడుగ లో జన్మించారని, నేటి తో ఆయన 80 సంవత్సరాలు పూర్తి చేసుకుని 81 వ సంవత్సరంలో అడుగు పెట్టిన సందర్భంగా ఆరోగ్యం గా ఉండాలని వారు ఆకాంక్షించారు.
సింగరేణి లో కార్మికుల సంక్షేమం కోసం, వారి హక్కుల సాధన కోసం గట్టయ్య గారు సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఎఐటియుసి లో 1965 నుంచి 2023 వరకు వివిధ పదవులు చేపట్టి నిరంతరం పోరాటం చేశారని వారు పేర్కొన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఏఐటియుసి ఆర్జీ వన్ బ్రాంచి ఉపాధ్యక్షులు మాదన మహేష్, ప్రాజెక్టు కార్యదర్శి గుర్రం ప్రభుదాస్, ఏఐటియుసి నగర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎం ఎ గౌస్, నాయకులు రాయుడు శ్రీనివాస్, భక్తి శ్రీనివాస్, యేలేశ్వరం సత్యనారాయణ, చీకటి అంజయ్య, సోషల్ మీడియా ఇంచార్జీ చంద తిరుపతి, ఆఫీస్ కార్యదర్శి తొడుపునూరి రమేశ్ కుమార్ లు పాల్గొని గట్టయ్య జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

AITUC leaders extend birthday greetings to Gattaiah.

You cannot copy content of this page

Scroll to Top