డిప్యూటీ కమిషనర్ నాయిని వెంకట స్వామి
రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. రామగుండం నగర పాలక సంస్థ అన్ని చర్యలు తీసుకుంటున్నదని డిప్యూటీ కమిషనర్ నాయిని వెంకట స్వామి అన్నారు. స్వచ్చతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా రామగుండం నగర పాలక సంస్థ పారిశుద్ధ్య సిబ్బందికి అల్లూరు పట్టణ ఆరోగ్య కేంద్రంలో వైద్య పరీక్షలు నిర్వహించారు . ఈ సంధర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ విధి నిర్వహణలో ఉన్నప్పుడు వ్యక్తిగత రక్షణ కొరకు నగర పాలక సంస్థ ఇచ్చిన జాకెట్ , చేతి తొడుగులు, పాద రక్షలు ధరించాలని అన్నారు. కాగా అంతకుముందు సoతోష్ నగర్ లో తడి చెత్త పొడి చెత్త వేరు చేయడంపై ప్రజలకు అవగాహన కల్పించారు. నగర పాలక సంస్థ పారిశుద్ధ్య వాహనాలకు ఇవ్వకుండా బహిరంగ ప్రదేశాలలో చెత్త వేస్తే జరిమానా విధించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమాల్లో సానిటరీ ఇన్స్పెక్టర్ నాగ భూషణం , ఎన్విరాన్ మెంటల్ ఇంజనీర్ మధుకర్ , అల్లూరు ఆరోగ్య కేంద్రం వైద్యులు దీవెన , శ్రావణ్ , వార్డు అధికారి సా హిత్య , స్వచ్చ భారత్ మిషన్ కన్సల్టన్సీ ప్రతినిధులు శివ కృష్ణ , కరుణాకర్ , మహేంద్ర , సానిటరీ జవాన్ సారయ్య , ఆర్ పి లు నాగమణి , రమ తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


