
మల్లారెడ్డికి షాక్.. కాంగ్రెస్లోకి బీఆర్ఎస్ కార్పొరేటర్లు?
హైదరాబాద్:మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డికి షాక్ తగిలింది. జవహర్నగర్ మేయర్ మేకల కావ్యపై 19 మంది అసమ్మతి కార్పొరేటర్లు అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. కొత్త మేయర్ను ఎన్నుకున్న తర్వాత వీరంతా కాంగ్రెస్లో చేరనున్నట్లు తెలుస్తోంది. మల్లారెడ్డి, మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి మధ్య విభేదాలు తలెత్తగా, ఎలక్షన్స్ ముందు సుధీర్ BRSకు రాజీనామా చేసి కాంగ్రెస్లో చేరిన విషయం తెలిసిందే.
