Son-in-law Dies : అత్త శ్రద్ధాంజలి బ్యానర్ కోసం వెళ్లి అల్లుడు మృతి

TRINETHRAM NEWS

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ : అత్త అల్లుడు కుటుంబాలలో విషాదం.సంఘటన స్థలంలో అత్త శ్రద్ధాంజలి బ్యానర్ ను అల్లుడి మృతదేహం పై కప్పి షాక్ కు గురి అయిన స్థానికులు ఒకే రోజు ఇద్దరు మృతి తో శోకసముద్రంలో రెండు కుటుంబాలు. అత్త మృతి తో శ్రద్ధాంజలి బ్యానర్ తీసుకెళ్తున్న అల్లుడు రోడ్డు ప్రమాదంలో మృతి.వికారాబాద్ జిల్లా వికారాబాద్ పట్టణం నుండి ఫుల్ మద్ది గ్రామానికి చెందిన లక్ష్మి మృతి చెందడం జరిగింది. అత్త చనిపోయిందని వికారాబాద్ నుండి బ్యానర్ ప్రింట్ చేసుకొని ఫుల్ మద్ది గ్రామానికి తిరిగి వెళుతున్న సమయంలో గుంత తో బైక్ స్కిడ్ అయి పడిపోయిన శ్రీనివాస్. వెనుక నుంచి స్పీడ్ గా వస్తున్న ఒక డీసీఎం శ్రీనివాస్ పై నుంచి వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందిన శ్రీనివాస్. కేసు నమోదు చేసిన పోలీసులు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Son-in-law dies

You cannot copy content of this page

Scroll to Top