Kanchi Mahender : కంచి మహేందర్ ఆధ్వర్యంలో పెరేడ్ గ్రౌండ్ కి బయలుదేరిన బీజేపి శ్రేణులు

TRINETHRAM NEWS

కుకట్పల్లి సెప్టెంబర్ 17 : (త్రినేత్రం న్యూస్) కూకట్ పల్లి. నగరంలోని తెలంగాణ విమోచన దినోత్సవ సందర్భంగా జింఖాన పరేడ్ గ్రాండ్ లో బుధవారం సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కూకట్ పల్లి నియోజకవర్గం పరిధిలోని బాలానగర్, ఫతేనగర్ డివిజన్ నుండి బీజేపి సీనియర్ నాయకులు కంచి మహేందర్ ఆధ్వర్యంలో భారీగా శ్రేణులు తీరని వెళ్ళారు. ఈ నేపథ్యంలో మంచి మహేందర్ మాట్లాడుతూ నిజాం నిరంకుశ పాలన నుండి విముక్తి కలిగిన రోజని కానీ సెప్టెంబర్ 17న ప్రజాపాలన దినోత్సవమని జరుపుకోవడం సిగ్గుచేటు అని తెలిపారు. ఎం ఐ ఎం వారి మెప్పుకోసమే ప్రభుత్వం విమోచన దినోత్సవాన్ని జరుపుకోవడం లేదని విమర్శించారు. నైజాం పాలకుల నుండి విముక్తి కలిగిన ఈ రోజుని తెలంగాణ ప్రజలందరూ జరుపుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో శంకర్ రెడ్డి, సురేందర్ రెడ్డి, రమేష్, డాక్టర్ కిరణ్, యాదగిరి శివరంజని బీజేపీ నాయకులు కార్యకర్తలు తీరని వెళ్ళారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Kanchi Mahender leave for parade ground

You cannot copy content of this page

Scroll to Top