రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయం వినాయక చవితి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యాలయం లో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం వద్ద పోలీస్ కమీషనర్ అంబర్ కిషోర్ ఝా అధికారులతో కలిసి పాల్గొని పూజా కార్యక్రమం నిర్వహించి తీర్థప్రసాదాలు తీసుకొన్నారు.
సందర్భంగా సీపీ మాట్లాడుతూ ఈ వినాయక నవరాత్రి ఉత్సవాలను ప్రజలు భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించుకోవాలని, అందరు తాము మొదలు పెట్టిన పనులు ఎలాంటి విఘ్నాలు లేకుండా పూర్తి అయ్యేటట్లు చూడాలని, కష్టాలను తొలగించి ప్రజల జీవితాల్లో సుఖసంతోషాలను నింపాలని మహాగణపతిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముఖ్యంగా రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ప్రజలలో ఉన్న సోదరభావం, ఐక్యత ఎంతో సంతోషాన్ని కలిస్తుందని, పోలీసు శాఖ సూచించిన మేరకు ఆయా మండపాల వద్ద నిర్వాహకులు, యువత పోలీస్ వారి సూచనల ప్రకారం జాగ్రత్తలు తీసుకుంటున్నారని, ఇదేరీతిలో ఈరోజు నుండి నిమజ్జనం రోజు వరకు ప్రతి ఒక్కరు పోలీస్ వారికి సహకరించాలని ఎటువంటి ఆటంకాలు లేకుండా నవరాత్రులు, నిమజ్జన శోభయాత్ర నిర్వహించుకోవాలని ప్రజలకు సీపీ తెలిపారు పూజా కార్యక్రమంలో గోదావరిఖని ఎసిపి ఎం. రమేష్, ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్, గోదావరిఖని వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి రామగుండం సర్కిల్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ కుమార్, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రాజేశ్వర్ రావు, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ భీమేష్, ఆర్ ఐ దామోదర్, శ్రీనివాస్, శేఖర్,మల్లేశం, సిసి హరీష్, ఆర్ఎస్ఐ లు , పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


