వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్: పరిగి పట్టణంలోని అయ్యప్ప దేవాలయంలో పాలాది శ్రీనివాస్ గుప్త ఆధ్వర్యంలో ఉచిత మట్టి వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న పరిగి ఎమ్మెల్యే TRR సతీమణి శ్రీమతి టి.ఉమా రామ్మోహన్ రెడ్డి భక్తులకు మట్టి వినాయక విగ్రహాలను అందజేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భక్తి భావంతో జరుపుకునే గణేశ్ నవరాత్రులు సమాజంలో ఐకమత్యం,ఆనందం తీసుకురావాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో బ్లాక్ అధ్యక్షులు పార్థసారథి పంతులు,పరిగి మార్కెట్ కమిటీ చైర్మన్ పరశురాం రెడ్డి,పట్టణ అధ్యక్షులు ఎర్రగడ్డ పల్లి కృష్ణ,డిసిసి ఉపాధ్యక్షులు లాల్ కృష్ణ, డిసిసి ప్రధాన కార్యదర్శి హనుమంతు ముదిరాజ్,కాంగ్రెస్ పార్టీ నాయకులు రామచంద్ర యాదవ్, అక్బర్,మాధవరెడ్డి,శ్రీనివాస్,రవికాంత్,మహిళా కాంగ్రెస్ నాయకురాలు సురేఖ రెడ్డి,ఉమా రెడ్డి,లక్ష్మి,శశికళ మరియు స్థానిక నాయకులు, యువకులు,భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


