జూన్ 26, 2026
TRINETHRAM NEWS

శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లికి మహిళలు బోనాలు నైవేద్యం సమర్పించారు.

డిండి (గుండ్ల పల్లి) ఆగష్టు 26 త్రినేత్రం న్యూస్. డిండి మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలో ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా మహిళలు భక్తి, శ్రద్దలతో శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి కి బోనాలు ఘనంగా నిర్వహిస్తారు. ఈ సందర్బంగా ఈ ఏడాది కూడా అంగరంగ వైభవంగా భక్తి శ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు. మహిళలు బోనం ఎత్తుకొని డప్పు చప్పుళ్లతో బొడ్రాయి దగ్గరికి వెళ్లి మొక్కలు చెల్లించుకుని శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయం దగ్గర పిల్ల పాపలతో కుటుంబ సమేతంగా బోనం నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. రేణుక ఎల్లమ్మ తల్లికి ప్రతి ఏడాది లాగా ఈ ఏడాది కూడా అంగరంగ వైభవంగా భక్త శ్రద్ధలతో జరుపుకోవడం సంతోషంగా ఉందని వేడుకున్నారు. ఈ సందర్భంగా పాడి పంటలతో, పిల్ల పాపలతో సుఖ సంతోషాలతో ఉండాలని మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించి ముక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో పెద్దలు, మహిళలు ,చిన్నారులు తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Sri Renuka Yellamma's mother Bonalu

You cannot copy content of this page