ఏఐటియుసి నాయకులు
గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు గోసిక మోహన్, గౌతం గోవర్దన్, సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఎఐటియుసి ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లా గౌడ్ లు పేర్కొన్నారు సోమవారం గోదావరిఖని భాస్కర్ రావు భవన్ లో జరిగిన సుధాకర్ రెడ్డి సంతాప సభ లో ముందుగా ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం వారు మాట్లాడుతూ దేశ రాజకీయాల్లో బహుముఖ ప్రజ్ఞాశాలిగా మేధావిగా , ప్రజాప్రతినిధిగా, వామపక్షాలకే వన్నె తెచ్చిన గొప్ప మహోన్నతమైన వ్యక్తి సురవరం సుధాకర్ రెడ్డి అని వారు పేర్కొన్నారు. స్వాతంత్ర్య సమరయోధుల కుటుంబంలో జన్మించిన సురవరం చిన్నప్పటి నుంచే కమ్యూనిస్టు భావాలను అలవర్చుకొని ఏఐఎస్ఎఫ్ లో చేరి విద్యార్థి, యువజన నాయకునిగా పట్టణ స్థాయి నుంచి రాష్ట్ర, జాతీయ అధ్యక్షుడిగా, ప్రధాన కార్యదర్శి గా విద్యార్థి, యువజన సమాఖ్య లకు నాయకత్వం వహించి అంచెలంచెలుగా ఎదిగారన్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సిపిఐ రథసారధి గా పార్టీ నిర్మాణాన్ని పటిష్టపరుస్తూ పాలకుల ప్రజా, కార్మిక వ్యతిరేక విధానాలపై సమరశంఖం పూరించారని వారన్నారు. రెండు సార్లు నల్గొండ పార్లమెంటు సభ్యులు గా గెలుపొంది, దేశంలో ఉన్న ప్రజా, కార్మిక, రైతు, విద్యార్థి, యువజన మహిళా సంక్షేమం కోసం వారి హక్కుల సాధన కోసం చట్ట సభల్లో పాలకులను నిలదీశారని వారు పేర్కొన్నారు. సిపిఐ నగర కార్యదర్శి కనకరాజు అద్యక్షతన జరిగిన ఈ సంతాప సభలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు తాళ్ళపెళ్లి మల్లయ్య, మడికొండ ఓదేమ్మ, మార్కపూరి సూర్య, జిల్లా కౌన్సిల్ సభ్యులు మాటేటి శంకర్, ఆసాల రమ, తొడుపునూరి రమేశ్ కుమార్, రేణికుంట్ల ప్రీతం, సిపిఐ, ఏఐటియుసి ప్రజా సంఘాల నాయకులు ఎం.ఎ.గౌస్, ఎస్ వెంకట్ రెడ్డి, గొడిశల నరేశ్, ఎజ్జ రాజయ్య , ఆసాల నవీన్, వై.లెనిన్, తిరుమల, సుజాత, కలవల జగన్నాథం, బండి మల్లేష్, అబ్దుల్ కరీం, పడాల కనకరాజు, ఎర్రగొల్ల చేరాలు, జీవన్ తో పాటు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


