Dharna : గత వారం రోజులుగా కళాశాలకు తాళం

TRINETHRAM NEWS

కళాశాల విద్యార్థులు ప్రతి దినం వచ్చి వెను తిరగడం గమనార్హం.
విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న ప్రిన్సిపాల్ పై చర్యలు తీసుకోవాలి.
-ఏ ఐ ఎస్ ఫ్ తెలంగాణ రాష్ట్ర నాయకులు. – ప్రేమ్ కుమార్.

డిండి (గుండ్ల పల్లి)ఆగష్టు 25 త్రినేత్రం న్యూస్. డిండి మండల కేంద్రంలోని వెంకటేశ్వర ఒకేషనల్ కళాశాల ను సీజ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో సోమవారం ధర్నా నిర్వహించారు. ఏఐఎస్ఎఫ్ తెలంగాణ రాష్ట్ర నాయకులు బలుమల ప్రేమ్ కుమార్ మాట్లాడుతూ, డిండి మండల కేంద్రంలో ఉన్నటువంటి వెంకటేశ్వర ఒకేషనల్ కాలేజీ విద్యార్థుల జీవితాలతో కళాశాల యాజమాన్యం మరియు ప్రిన్సిపాల్ చెలగాటమాడుతుందని గత వారం రోజుల నుంచి విద్యార్థులు కళాశాలకు వస్తున్న కళాశాల గేటు మూసివేస్తూ వచ్చిన విద్యార్థులను వెనక్కి పంపిస్తున్నారని ఆరోపించారు.

కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు స్కాలర్షిప్స్ రాలేదని, పనిచేస్తున్న లెక్చరర్స్ కు జీతాలు ఇవ్వడం లేదని, మూడు కోర్సులు ఉంటే 9 మంది లెక్చరర్స్ అవసరం ఉండగా కేవలం ముగ్గురితో మాత్రమే కళాశాల నడిపిస్తున్నారని ఆయన అన్నారు. కళాశాల యాజమాన్యంపై ,ప్రిన్సిపాల్ పై చర్యలు తీసుకొని విద్యార్థిని విద్యార్థులకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ డివిజన్ అధ్యక్షుడు సురిగి వినయ్, కళాశాల విద్యార్థిని విద్యార్థులు కళ్యాణ్ ,పవన్, రాజు, సాయి, శిల్ప ,శిరీష, శివాని ,తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

AISF dharna

You cannot copy content of this page

Scroll to Top