Collector Koya : భూ సమస్యల పరిష్కారానికి పట్టిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ కోయ

TRINETHRAM NEWS

కాల్వ శ్రీరాంపూర్ మండలంలో విస్తృతంగా పర్యటించిన జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష

పెద్దపల్లి, ఆగస్టు 21: త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. గురువారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష కాల్వ శ్రీరాంపూర్ మండలంలో విస్తృతంగా పర్యటించారు శ్రీరాంపూర్ మండలంలోని కూనారం, ఇదులాపూర్ గ్రామంలో మిస్సింగ్ సర్వే నెంబర్ పట్టా కోసం వచ్చిన దరఖాస్తులను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన భూ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులకు సూచించారు
అనంతరం జాఫర్ ఖాన్ పేట, ఇదులాపూర్ గ్రామం లోని అప్పర్ ప్రైమరీ పాఠశాలను, అంగన్వాడీ కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ప్రతి ఒక విద్యార్థికి కనీస విద్యా ప్రమాణాలు ఉండేలా చూడాలని, పిల్లలకు చదవడం తో పాటు చదివింది అర్థం చేసుకునేలా గ్రహణశక్తి పెంపోందించాలని అన్నారు అంగన్వాడీ సెంటర్ లను పరిశీలించి ఎంత మంది పిల్లలు వస్తున్నారు. ఎలాంటి ఆహారం ఇస్తున్నారు, హాజరు రిజిస్టర్ లను పరిశీలించారు ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట తహసీల్దార్ జగదీశ్వర్ రావు, డి.టి. శంకర్, సర్వేయర్ రాజు,సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Collector Koya takes concrete steps to resolve land issues

You cannot copy content of this page

Scroll to Top