ఆత్మహత్యకు అనుమతి కోరిన మహిళా జడ్జి
అలహాబాద్:
సీనియర్ న్యాయమూర్తి లైంగిక వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యకు అనుమతి కోరుతూ ఉత్తర ప్రదేశ్ లోని బందా జిల్లా మహిళా జడ్జి CJI (భారత ప్రధాన న్యాయమూర్తి) కి లేఖ రాశారు.
ఈ లేఖ లో ” నేను చాలా కాలంగా వేదింపులకు గురవుతున్నా, నన్ను ఓ చెత్తలా చూసారు. అందువల్ల గౌరవ ప్రదముగా నా జీవితాన్ని ముగించటానికి అనుమతి ఇవ్వండి, అని ఆమె CJI ( భారత ప్రధాన న్యాయమూర్తి) ని కోరింది.
CJI చంద్రచూద్ సూచనతో ఆమె రాసిన లేఖపై వెంటనే నివేదిక ఇవ్వాలని సుప్రీం కోర్టు సెక్రటరీ జనరల్ అలహాబాద్ కోర్ట్ కు లేఖ రాశారు.