నిజాంనగర్ బీటి రోడ్డు నిధులు మంజూరైనా నిర్మాణంలో జాప్యం

TRINETHRAM NEWS

వర్షాలకు బురద మయమైన రోడ్డు – అనేక ఇబ్బందులు పడుతున్న గ్రామ ప్రజలు

బీటి రోడ్డు నిర్మాణంలో అధికారుల నిర్లక్ష్యం

రాకపోకలకు తీవ్ర ఇబ్బంది పడుతున్న ప్రయాణికులు.
త్రినేత్రం న్యూస్ డిండి (గుండ్ల పల్లి )ఆగస్టు 14. డిండి మండలపరిధిలోని నిజాంనగర్ గ్రామానికి బీటీ రోడ్ లేక మట్టి రోడ్డుతో ప్రజల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల కురిసిన ఆకాల వర్షాలకు మట్టి రోడ్డు కాస్త గుంతల మయంగా మారి నీటి గుంతలతో బురద మయంగా మారి గ్రామానికి వెళ్లకుండా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత ప్రభుత్వంలో దాసరి నెమలిపూర్ నుంచి వయా ఆకుతోటపల్లి నిజాంనగర్ మీదుగా చెరుకుపల్లి పి డబ్ల్యు డి రోడ్డు వరకు 10.50 కిలో మీటర్ల ఒక కోటి 40 లక్షల నిధులు మంజూరు అయి టెండర్ ప్రక్రియ పూర్తి అయినప్పటికీ బీటీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం కాకపోవడంతో గ్రామానికి వెళ్లాలంటే ప్రజలు నాన ఆవస్థలు పడాల్సిన పరిస్థితి ఎదురయింది. నిధులు మంజూరై టెండర్ ప్రక్రియ పూర్తి అయిన పనులు ప్రారంభించకపోవడం పట్ల అధికారుల నిర్లక్ష్యం కనిపిస్తుంది .తక్షణమే సంబంధిత అధికారులు నిర్లక్ష్యం వీడి పనులు ప్రారంభించాలని నిజాంనగర్ ప్రజలు కోరుతున్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Nizamnagar BT Road

You cannot copy content of this page

Scroll to Top