Heavy Rain : నేటి నుండి మూడు రోజులపాటు.. తెలంగాణ జిల్లాలో భారీ వర్షాలు!

TRINETHRAM NEWS

Trinethram News : హైదరాబాద్ ఆగస్టు 10 : రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. శనివారం సాయంత్రం హైదరాబాద్‌లో మరోసారి కుండపోత వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన భారీ వర్షానికి నగర వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

రహదారులపైకి భారీగా నీరు చేరడంతో వాహన దారులు రాకపోకలు సాగించేందుకు ఇబ్బంది పడ్డారు. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఇవాళ కూడా నగరంలో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు రాష్ట్రంలోనూ కుండపోత వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది.

తెలంగాణకు హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు మరోసారి రెయిన్ అలర్ట్ జారీ చేశారు. దక్షిణ కోస్తాంధ్ర తీరం వద్ద ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆదివారం తోపాటు సోమ, మంగళవారాల్లోనూ పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

రాష్ట్రంలో వచ్చే మూడు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సిద్ధిపేట, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, నాగర్ ‌కర్నూల్, కుమురం భీం ఆసిఫాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్ తోపాటు…

మేడ్చల్ మల్కాజిగిరి, జనగామ, హనుమకొండ, యాదాద్రి భువనగిరి, నారాయణపేట జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.

హైదరాబాద్‌లో శనివారం రాత్రికురిసిన భారీ వర్షాల కారణంగా పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. కుండపోత వాన నేపథ్యం లో జీహెచ్ఎంసీ, హైడ్రా సిబ్బంది అప్రమత్తమ య్యారు. లోతట్టు ప్రాంతా ల్లో సహాయక చర్యలు చేపట్టారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Heavy rains in Telangana

You cannot copy content of this page

Scroll to Top