బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు నరేందర్ రెడ్డి.
డిండి (గుండ్ల పల్లి)ఆగస్టు 06 త్రినేత్రం న్యూస్. స్థానిక సంస్థల పాలన ముగిసి 18 నెలలు గడిచినప్పటికీ ఎన్నికలు నిర్వహించకుండా రాష్ట్ర ప్రభుత్వం కాలయాపన చేస్తుందని, స్థానిక సంస్థలకు వెంటనే ఎన్నికలు నిర్వహించాలని భారతీయ జనతా పార్టీ నల్లగొండ జిల్లా ఉపాధ్యక్షులు వానం నరేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. గ్రామాలలో ప్రజలకు కనీస వసతులుకల్పించలేకపోతుందని, గ్రామాలలో పాలన పడక వేసిందని, ప్రత్యేకఅధికారులకు గ్రామ కార్యదర్శులకు నిధులు కేటాయించకుండా గ్రామాలలో కనీస వసతులు కల్పించమని, అంటే నిధుల లేని కారణంగా వాళ్లు కనీస వసతులు కల్పించలేక పోతున్నారని అన్నారు.
గ్రామాలలో విరివిగా కంప చెట్లుపెరిగినకారణంగాపరిశుభ్రత లోపించిందని, వీధిలైట్లు వెలగకపోవడం, మంచినీటి సౌకర్యాలు సక్రమంగా కల్పించలేకపోవడం,గ్రామాలవీధులలోవీధికుక్కలు,పందులు, కోతులు, ఇష్టానుసారంగా సంచరించడం, దోమల బెడద తీవ్రంగా ఉండడం ,అనేక సమస్యలు గ్రామాల్లో తిష్ట వేశాయని ఆయన విమర్శించారు. ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు ఎన్నికలు నిర్వహించి గ్రామా భివృద్ధికి తోడ్పడాలని అన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


