Trinethram News : ఈరోజు 129 – సూరారం డివిజన్ పరిధిలోని పలు కాలనీలవాసులు పేట్ బషీరాబాద్ లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో బిఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ ని కలిసి మంజీరా నీటి సరఫరా, త్రాగునీటి సమస్యపై వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా బిఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ మాట్లాడుతూ…. రోజురోజుకు విస్తరిస్తున్న నగరానికి, పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మంచి నీరు అందించేలా, త్రాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు ప్రణాళిక బద్ధంగా చర్యలు చేపడుతున్నామని అన్నారు. అనంతరం జలమండలి అధికారులతో ఫోన్లో మాట్లాడిన ఎమ్మెల్యే…. ప్రజలకు త్రాగునీటి సమస్య లేకుండా అధికారులు సమన్వయంతో పనిచేస్తూ గతంలో మాదిరిగా నీటిని సరఫరా చేసేలా అధికారులు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు పుప్పాల భాస్కర్, డివిజన్ యూత్ అధ్యక్షులు దొడ్ల శ్రీనివాస్, సంక్షేమ సంఘాల సభ్యులు కె. శ్రీనివాస్ రెడ్డి, శ్రీను, దారం శివ గుప్తా, యాదయ్య గౌడ్, బషీర్, సురేష్ బాబు, సురేష్, చంద్రశేఖర్, అమృత, లత, లక్ష్మీ, రమేష్, మహేష్, సత్తి, సదానందం, జీవన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


