కూకట్పల్లి త్రినేత్రం న్యూస్ ఆగస్టు 04 : 124 ఆల్విన్ కాలనీ డివిజన్ ఎల్లమ్మబండ పరిధిలోని మొగులమ్మ కాలనీ లో ముపై ఆరు లక్షల యాభై వేల రూపాయల నిధులతో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్లను డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ పరిశీలించడం జరిగింది. అదేవిధంగా కాలనీ లో పర్యటించి కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న అభివృద్ధి మరియు సంక్షేమ పథకాల గురించి మరియు ప్రభుత్వ పనితీరు గురించి ప్రజల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరుతో ప్రజలు సంతోషంగా ఉన్నారని అన్నారు.
మహిళలకు ఉచిత బస్, ఉచిత కరెంట్, గ్యాస్, సన్న బియ్యం వంటి మొదలగు పథకాలతో ప్రజలు ప్రభుత్వం పట్ల సానుకూలంగా ఉన్నట్లు తెలియచేసారు. అలాగే నూతనంగా నిర్మించిన సీసీ రోడ్డుకు ఇరువైపులా అంచుల వద్ద మట్టి వేయాలని, మంచిగా క్యూరింగ్ చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సంబంధిత అధికారులకు తెలిపారు. రోడ్డుకు ఇరువైపులా చెట్లు పెట్టి కాలనీని పచ్చని వనంలా సుందరంగా మార్చుకోవాలని కాలనీ వాసులకు సూచించారు. ఈ కార్యక్రమంలో శివరాజ్ గౌడ్, భాస్కర్, జాన్, శ్యాముల్, మహేష్, బషీర్, విక్రమ్, ఆయుబ్, నరేష్, రఫీ, పాషా.మియా, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


