Leaders Meeting : స్థానిక ఎన్నికల దేవరకొండ నియోజక వర్గ బి జె పి ముఖ్య నాయకుల సమావేశం

TRINETHRAM NEWS

అసెంబ్లీ కన్వీనర్ ఏటి కృష్ణ.

దేవరకొండ జులై 31 త్రినేత్రం న్యూస్. దేవరకొండలో భారతీయ జనతా పార్టీ నియోజకవర్గ కార్యాలయంలో అసెంబ్లీ కన్వీనర్ ఏ టి కృష్ణ అధ్యక్షతన స్థానిక సంస్థల ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా మాజీ ఎంపీ నల్గొండ జిల్లా ఎన్నికల ప్రబారి బూర నర్సయ్య గౌడ్ జిల్లా అధ్యక్షులు నాగం వర్షిత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సైదిరెడ్డి, ఎన్నికల ఇన్చార్జ్ వీరెల్లి చంద్రశేఖర్ లో పాల్గొన్నారు.
దేవరకొండ నియోజకవర్గం లోని మండలాలలో గ్రామాలలో స్థానిక సంస్థల ఎన్నికలలో బిజెపి పార్టీ అధ్యక్షులు ప్రతి గ్రామంలో కాషాయ జెండా ఎగర వేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ప్రజలు బిజెపి పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారని అన్నారు.
ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కర్నాటి సురేష్, నక్క వెంకటేష్ యాదవ్, జిల్లా ప్రధాన కార్యదర్శి చేనముని రాములు, జిల్లా ఉపాధ్యక్షులు వానం నరేందర్ రెడ్డి, ఎస్టి మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు అంకూరి నరసింహ, వివిధ మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు రాష్ట్ర ,,జిల్లా నాయకులు, తదితరులు పాల్గొన్నారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Constituency BJP Chief Leaders Meeting

You cannot copy content of this page

Scroll to Top