బసంత్ నగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ శ్రీహర్ష
పాలకుర్తి , పెద్దపల్లి : జూలై-31: త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. గురువారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష పాలకుర్తి మండలం బసంత్ నగర్ లో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. పి.హెచ్.సి లో ఉన్న వార్డులు, ల్యాబ్ లను కలెక్టర్ పరిశీలించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ, టీబీ వ్యాధి వచ్చే అవకాశం ఉన్న వల్న రేబుల్ (టీబి వ్యాధి సోకే అవకాశం ఉన్న) జనాభా ను గుర్తించి నవంబర్ లోపు వారి స్క్రినింగ్, వ్యాధి నిర్ధారణ పరీక్షల నిర్వహణ పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు. ఎన్.సి.డి సర్వే ద్వారా గుర్తించిన మధుమేహం, బీపి వ్యాధిగ్రస్తులు మందులు సరిగ్గా వాడుతున్నారో లేదో రెగ్యులర్ ఫాలో అప్ చేయాలని అన్నారు. ల్యాబ్ లో పరీక్ష ఫలితాలు సకాలంలో అందించాలని కలెక్టర్ తెలిపారు.
అనంతరం పెద్దపల్లి శాంతి నగర్ లోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, అంగన్వాడీ సెంటర్ ను కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించి మధ్యాహ్న భోజనం వండే కిచెన్ ఏరియా, తరగతి గదులను పరిశీలించారు. పిల్లలకు కనీస విద్యా ప్రమాణాలు అందే విధంగా ఉపాధ్యాయులు కృషి చేయాలని అన్నారు. అంగన్వాడీ కేంద్రాలలో పిల్లల ఎదుగుదల రెగ్యులర్ మానిటరింగ్ చేయాలని కలెక్టర్ సూచించారు ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట వైద్య అధికారులు డాక్టర్ సరళి, డాక్టర్ లక్ష్మీ భవానీ, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


