రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు కలెక్టర్ వినతి పత్రం ఇవ్వడం జరిగింది
Trinethram News : ఎస్సీ వర్గీకరణ రోస్టర్ పాయింట్ల కేటాయింపులో మాలలకు జరిగిన అన్యాయాని సరిదిద్దుందుకై వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి కి మాలల మహానాడు జిల్లా అధ్యక్షుడు మొలకలపల్లి మద్దిలేటి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.
15% ఎస్సీ రిజర్వేషన్లు 5% అనగా గ్రూప్ 3వ భాగం ఉన్న మాల, మాల అనుబంధ కులాలకు (గ్రూప్ -3)మూడవది 16వ పాయింట్ ఇవ్వకుండా నాలుగవది 22 వ రోస్టర్ పాయింట్ ఇవ్వడం వల్ల మాలలకు విద్య,ఉద్యోగ అవకాశాలలో తీవ్ర నష్టం జరుగుతుంది. ప్రభుత్వం వెంటనే రోస్టర్ పాయింట్స్ సవరించి విద్య,ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయాలి అంతవరకు ఎలాంటి ఉద్యోగాలు భర్తీ చేయకూడదని మాలమహానాడు నాయకులు డిమాండ్ చేశారు.
ఇటీవల కాలంలో శాతవాహన యూనివర్సిటీ ఇచ్చిన ఉద్యోగం నోటిఫికేషన్ లో ఎస్సీలకు మొత్తం 6 పోస్టులు కేటాయించగా మొత్తంలో 15 శాతం రిజర్వేషన్ ఉండగా, ఐదు శాతం ఉన్న మాల మాల ఉపకుల వారికి రెండు పోస్టులు కేటాయించవలసి ఉండగా ఒక పోస్ట్ కూడా కేటాయించలేదు. దీన్ని బట్టి రోస్టర్ పాయింట్ విధానం లో లోపభూయిష్టంగా ఉంది అనేది అర్థమవుతుంది.
డిమాండ్స్ :
1) దళితుల జనాభా ప్రకారం 18 శాతం రిజర్వేషన్లు వెంటనే పెంచాలి.
2) డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అభయ హస్తం పథకాన్ని వెంటనే ప్రారంభించి అమలు చేయాలి.
3) రోస్టర్ విధానాన్ని సవరించేంతవరకు అన్ని ఉద్యోగ నోటిఫికేషన్లు నిలుపుదల చేయాలని కోరుచున్నాము.
ఈ కార్యక్రమంలో మాలమహానాడు జిల్లా కమిటీ సభ్యులు బీజ్జా వెంకటేష్, అంబటి రవి, అన్నల దాసి రమేష్, బూరుగా నాగరాజు, లెంకపల్లి శివకుమార్,నరసింహ, దేవరాజు తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


