దేవరకొండ జులై 27 త్రినేత్రం న్యూస్. దేవరకొండ నియోజకవర్గం చందంపేట మండల పరిధిలోని పోలేపల్లి X రోడ్డు ధనలక్ష్మి ఫంక్షన్ హాల్ లో ప్రభుత్వం నుంచి మంజూరు అయిన నూతన రేషన్ కార్డులను నల్గొండ జిల్లా ఇంచార్జ్ మంత్రి, ఎస్టి, ఎస్సీ మరియు మైనార్టీల సంక్షేమ శాఖ మంత్రి వర్యులు అడ్లూరి లక్ష్మణ్ , ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్ ,నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తో కలిసి పంపిణీ చేసిన దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ మంత్రి లక్ష్మణ్ మాట్లాడుతూ.. దేవరకొండ నియోజకవర్గంలో షెడ్యూల్డ్ కులాలు, తెగలు, అల్పసంఖ్యాక వర్గాల ప్రజల సంక్షేమానికి తననవంతుగా ఎక్కువ నిధులు అందించి సహకరిస్తానని, రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, సంక్షేమ శాఖల మంత్రి, నల్గొండ జిల్లా ఇన్చార్జి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ తెలిపారు.
దేవరకొండ నియోజకవర్గంలో శాసనసభ్యులు కోరిన విధంగా గిరిజన ప్రాంతాల అభివృద్ధికి, రోడ్ల అభివృద్ధి ,ఎస్సి,ఎస్టి సబ్ ప్లాన్ నిధులు కేటాయించి తన వంతు సహకారాన్ని అందిస్తానని మంత్రి చెప్పారు. గత ప్రభుత్వం ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదని, అలాంటిది తమ ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో అర్హులైన ప్రతి పేదవాడికి రేషన్ కార్డు ఇవ్వడం జరుగుతున్నదని, అంతేకాక ధనవంతులతో సమానంగా సన్న బియ్యంతో భోజనం చేసే విధంగా చర్యలు చేబడుతున్నాం.
ఐదు లక్షల రూపాయలు ఇచ్చి ఇందిరమ్మ ఇండ్లు నిర్మిస్తున్నామని, ఉచిత బస్సు ప్రయాణం, 60 వేల మందికి ఉద్యోగాలు ఇచ్చామని, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు అమలు చేసిన ఘనత రేవంత్ రెడ్డి గారిదే అన్నారు. తమ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణతో పాటు, 42 శాతం బీసీ రిజర్వేషన్ కు సిఫారసు చేయడం జరిగిందని, ఎక్కడా లేని విధంగా కులగణన చేశామని, రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలకు అమలు చేస్తున్న కార్యక్రమాలు పేదలకే చేరాలని తెలిపారు. తన మంత్రిత్వ శాఖల ద్వారా తప్పనిసరిగా దేవరకొండకు ఎక్కువ నిధులను ఇచ్చేందుకు కృషి చేస్తానని మంత్రి పునరుద్గాటించారు.
ఎస్ఎల్బీసీ, డిండి ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామని, ఇతర నియోజకవర్గాలతో సమానంగా దేవరకొండను అభివృద్ధి చేస్తానని తెలిపారు. దేవరకొండ నియోజకవర్గానికి ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధుల్లో ఎక్కువ నిధులు కేటాయించాలని, రహదారులు లేని తండాలకు రహదారులకు నిధులు మంజూరు చేయాలని ,మైదాన ప్రాంతంలో ఐటిడిఏ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని మంత్రి కి ఎం ఎల్ ఏ విజ్ఞప్తి చేశారు.
జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాటిమాట్లాడుతూ… రేషన్ కార్డు నిరంతర ప్రక్రియ అని, అయితే చనిపోయిన వారి పేర్లను రేషన్ కార్డులో నుండి తొలగించే విధంగా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి చెప్పాలని కోరారు. సన్న బియ్యం పంపిణీ విషయంలో చౌకధర దుకాణా డీలర్లు పారదర్శకంగా ఉండాలని ,ఈ విషయంలో ఎలాంటి ఆరోపణలున్న తమ దృష్టికి తీసుకురావాలని ప్రజలను కోరారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


