కూకట్పల్లి త్రినేత్రం న్యూస్ జులై 23 : 124 ఆల్విన్ కాలనీ డివిజన్ శంషిగుడా పరిధిలోని ఇందిరానగర్ కాలనీ లో నివసించే అంబుర్ లక్ష్మమ్మ (59) కల్తీ కల్లు తాగి అనారోగ్యం పాలై గత పది రోజుల నుండి హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మరణించడం జరిగింది. విషయం తెలుసుకున్న డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి డివిజి ట్రస్ట్ ద్వారా 10,000/- రూపాయలు ఆర్థిక సహాయం అందించి, కుటుంబ సభ్యులకు ధైర్యం నింపి, ఏ కష్టం వచ్చిన నేనున్నానంటూ భరోసా ఇచ్చారు. గోపాల్, కాసాని శంకర్, లింగం, శివ, లక్ష్మమ్మ కాలనీ వాసులు తదితరులు ఉన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


