జూన్ 26, 2026
TRINETHRAM NEWS

-బిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ .

డిండి (గుండ్ల పల్లి)జులై 21 త్రినేత్రం న్యూస్.

డిండి మండల బిఆర్ఎస్ ఉపాధ్యక్షులు సూదిని కృష్ణా రెడ్డి తల్లీ సూదిని రుక్కమ్మ మృతి చాలా బాధాకరమని బిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. సోమవారం సూదిని రుక్కమ్మ దశదిన కర్మ కార్యక్రమంలో ఆయన పాల్గొని రుక్కమ్మ చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ఆయన భగవంతుని ప్రార్ధించారు. ఆమె మృతి పట్ల ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన వెంట బిఆర్ఎస్ పార్టీ డిండి మండల అధ్యక్షుడు రాజినేని వెంకటేశ్వర రావు, పిఏసిఎస్ చైర్మన్ మాధవరం శ్రీనివాసరావు,మల్ రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి ,బొడ్డుపల్లి జయంత్,లోకసాని శ్రీనివాస్ రెడ్డి,దుబాయ్ శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Sudini Rukkamma's death is sad

You cannot copy content of this page