త్రినేత్రం న్యూస్ జులై 21 హనుమకొండ : హనుమకొండలోని పబ్లిక్ గార్డెన్ లో కుడుముల కుమార్ అధ్యక్షతన సమావేశం ఏర్పాటు చేశారు రాష్ట్ర నలుమూలల నుంచి కళాకారులు హాజరయ్యారు నూతనంగా రాష్ట్ర కమిటీని ఆఫీస్ బేరర్ గా 13 మంది తో పాటు రాష్ట్ర కమిటీ సభ్యులుగా 40 మందితో కమిటీని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన రొయ్యల రాజు హాజరై మాట్లాడారు రాష్ట్రంలో వేలాది మంది కళాకారులు వివిధ రంగాల్లో అనేక సంవత్సరాలు నుండిగా పనిచేస్తున్నప్పటికీ కళల్ని గుర్తింపు ఇవ్వడం కోసం ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి గుర్తింపు కార్డులు అనేది ఇవ్వలేదన్నారు
50 ఏళ్లు దాటిన ప్రతి ఒక్క కళాకారుడికి ప్రతినెల 10,000 పెన్షన్ ఇవ్వాలని అర్హులైనటువంటి పేద కళాకారులకు ఇందిరమ్మ ఇల్లు కేటాయించాలని గౌరవేతనం కూడా ప్రభుత్వం నిర్ణయించాలని ఈ సంస్కృతిక క్రీడల శాఖ నుండి కళాకారుల పేర్లు నమోదు చేసి వెంటనే ఐడి కార్డుతో పాటు ఒక కార్పొరేషన్ ఏర్పాటుచేసి ప్రభుత్వం నుండి వీళ్లకు ఉద్యోగాలు ఇచ్చి ఉపాధి గ కల్పించాలని ఈ సమావేశంలో తీర్మానం చేసుకున్నారు ఈ సమావేశంలో మొత్తం కార్మికుల కళాకారులు రాష్ట్రంలోని అన్ని జిల్లాల హాజరు కావడం జరిగింది కాబట్టి వెంటనే ప్రభుత్వం వీళ్ళ సమస్యలు గుర్తించి పరిష్కారం చేయవలసిందిగా కోరుచున్నాము అని అన్నారు
ఈ సందర్భంగా తెలంగాణ సాంస్కృతిక కళాకారుల సంఘం రాష్ట్ర కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు రాష్ట్ర అధ్యక్షులుగా కుడుముల కుమార్, ఉపాధ్యక్షులుగా తాళ్లపల్లి వెంకటలక్ష్మి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా గోలి కవిత, గౌరవ అధ్యక్షులుగా రొయ్యల రాజు, కోశాధికారి కొయ్యడ చంద్రయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ గా, బొజ్జ ఇందు, ప్రచార కార్యదర్శి, మన్నాల సరోజన, సహాయ కార్యదర్శి, తరాల సమ్మక్క, తోపాటు 40 మంది కమిటీ సభ్యులను ఎన్నుకున్నారు ఈ కార్యక్రమం లో రాష్ట్రం లోని అన్ని జిల్లాల కళాకారులూ పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


