Trinethram News : Jul 17, 2025, హర్యానా రోహ్‌తక్‌లో గురువారం తెల్లవారుజామున 3.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. భూకంప కేంద్రం రోహ్‌తక్‌కు తూర్పున 17 కిలోమీటర్ల దూరంలో, భూమి ఉపరితలం నుంచి 10 కిలోమీటర్ల లోతులో నమోదైంది. జనం భయంతో ఇండ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. అయితే, భూకంపంతో నష్టం జరిగినట్లు ఎలాంటి సమాచారం అందలేదని అధికారులు తెలిపారు. గత ఎనిమిది రోజుల్లో హర్యానాలో ఇది నాలుగో భూకంపం.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


