నేడు దిల్లీలో తెలుగు రాష్ట్రాల సీఎంల సమావేశం – నదీ జలాలకు సంబంధించిన అంశాలపైనే చర్చ
Trinethram News : తెలుగురాష్ట్రాల మధ్య నీటి విషయాలపై కేంద్ర జలశక్తిశాఖ మంత్రి నేతృత్వంలో సీఎంల భేటి ఆసక్తి రేపుతోంది. మొత్తం పది అంశాలతో జలశక్తి శాఖ అజెండా సిద్ధం చేసింది. అందులో ఏపీ ప్రభుత్వం ఏకైక అజెండాగా ప్రతిపాదించిన పోలవరం-బనకచర్ల అంశమే మొదటి వరుసలో ఉండగా, ఆ తర్వాత తెలంగాణ ప్రభుత్వం కోరుతున్న 9 అంశాలు ఉన్నాయి. సమావేశంలో వినిపించాల్సిన వాదనలపై జలవనరులశాఖ అధికారులు, న్యాయ నిపుణులతో గత అర్థరాత్రి వరకూ చర్చించన చంద్రబాబు, ఈ ఉదయం 11 గంటలకు మళ్లీ సమావేశంకానున్నారు.
తెలుగు రాష్ట్రాల మధ్య జల అంశాలకు సంబంధించి కేంద్రం ఇరురాష్ట్రాల సీఎంలతో ఇవాళ సమావేశం నిర్వహిస్తోంది. మధ్యాహ్నం రెండున్నరకు దిల్లీ శ్రమశక్తి భవన్ వేదికగా కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ సారథ్యంలో చంద్రబాబు, రేవంత్‌రెడ్డి భేటీ కానున్నారు. ‘పోలవరం-బనకచర్ల అనుసంధానం ప్రాజెక్టును ఏకైక చర్చనీయాంశంగా ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించగా, తెలంగాణ తరఫున ఆ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్త
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


