Good Governance : 13 వ రోజు సుపరిపాలనలో తొలి అడుగు

TRINETHRAM NEWS

సంక్షేమ, అభివృద్దే ప్రభుత్వ ద్యేయం

టూరిజం డైరెక్టర్ రమేష్ నాయుడు

త్రినేత్రం న్యూస్, ( పాడేరు) అల్లూరిజిల్లా, పాడేరు లో 13వ రోజు సుపరి పరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో రమేష్ నాయుడు మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళుగా భావిస్తూ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం సూపర్ సిక్స్ పథకాలు విడతల వారీగా ప్రజలకు అందిస్తూ ఏడాది పాలనలో ఎన్నో విజయాలు సాధిoచారన్నారు.

ఇందులోభాగంగా సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాత బస్టాండ్ శివాలయం వీధిలో అర్హత కలిగిన ప్రతిఒక్కరికి సంక్షేమ పథకాలు అందుతాయని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగు యువత రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి కోడా వెంకట సురేష్ కుమార్,కుంబిడిసింగి సర్పంచ్ వంతాల కృష్ణమూర్తి, గొండేలి సర్పంచ్,పలాసి సింహాచలం,ఎంపిటిసి రామారావు,కృష్ణారావు,తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

13th Day First Step

You cannot copy content of this page

Scroll to Top