జీరో ఆయిల్ మరియు మసాల
పాత తరం వంటకాలను అందుబాటులోకి తెచ్చినందుకు స్థానికుల హర్షం
Trinethram News : నల్గొండ జిల్లా కేంద్రంలోని ఎన్జీ కళాశాల ప్రాంగణం వద్ద ఏర్పాటుచేసిన మన చద్దన్నం నిర్వాహకులు కస్టమర్లకు నాలుగు రకాల చద్ది అన్నాన్ని అందుబాటులోకి ఉంచారు రాగి చద్దన్నం, జొన్న చద్దన్నం, సజ్జ చద్దన్నం, కొర్ర చద్దన్నం, మరియు అరికలు, సామలు మొదలగు లభించును అని తెలిపారు వీటిని 10 గంటలు నానబెట్టి మట్టి పాత్రలో గోరువెచ్చని పాలు వేసి తోడుగా పెరుగును జత చేస్తారు గిన్నెల పై మూత పెట్టి రాత్రంతా అలాగే ఉంచి ఉదయాన్నే కస్టమర్లకు అందుబాటులో తీసుకొస్తామని తెలిపారు ఈ విధంగా చేసిన చద్దన్నము ఉపయోగకరమైన బ్యాక్టీరియా లు మన శరీరానికి అవసర పడతాయని తక్షణ శక్తిని కాకుండా మధుమేహం రక్తపోటు వ్యాధులు నయం చేయడానికి ఈ సద్దన్నము ఎంతో ఉపయోగపడుతుందని ఈ తయారీ విధానంలో ఎలాంటి నూనె పదార్థాలు ఇతరత మసాలాలు వాడడం జరగదు అందుకు గుండెకు ఎంతో మేలు చేస్తాయని ఈ యొక్క చద్దన్నం తిన్న వారికి రక్తపోటు మధుమేహం క్రమేపి తగ్గుతుందని ఇలాంటి ఆర్గానిక్ ఫుడ్ తీసుకోవటం వలన వందేళ్ల ఆరోగ్యం మరియు వృద్ధాప్యం దరి చేరవు అలాగే పుచ్చకాయ గింజలు, గుమ్మడికాయ గింజలు, ఓట్స్ మరియు తాటి బెల్లంతో ఆర్గానిక్ లడ్డూలను కస్టమర్లకు అందుబాటులో ఉంటాయని వీటి ద్వారా పోషక పదార్థాలు ప్రోటీన్స్, విటమిన్స్, క్యాల్షియం మెగ్నీషియం ఐరన్ మొదలగు పోషక పదార్థాలు అందుతాయని పేర్కొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


