అరకు లోయలో తృటిలో తప్పిన పెను ప్రమాదం

TRINETHRAM NEWS

అల్లూరి జిల్లా అరకులోయ త్రినేత్రం న్యూస్ జూలై 9: అరకు వ్యాలీ పాత పోస్టాఫీస్ సమీపంలో నిన్న తెల్లవారుజామున 4:30 ప్రాంతంలో భారీ నీలగిరి చెట్టు అకస్మాత్తుగా నేలకొరిగింది. వరుసగా కురుస్తున్న వర్షాలు, ఈదురు గాలుల ప్రభావంతో చెట్టు వేర్లు దెబ్బతినడంతో ఈ ఘటన జరిగింది.
చెట్టు పడటంతో వైఎస్సార్సీపీ ఎంపిటిసి ఆనందరావు ఇల్లు, కారు, ఇతర చిన్నచిన్న వస్తువులకు నష్టం వాటిల్లింది. అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. చుట్టుపక్కల నివసిస్తున్న ప్రజలు భయాందోళనకు గురయ్యారు.
స్థానికులు, అధికారులు వర్షకాలంలో జాగ్రత్తలు తీసుకోవాలని, పాత చెట్లను గుర్తించి ముందుగానే తొలగించాలని కోరుతున్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

A near miss in Araku Valley

You cannot copy content of this page

Scroll to Top