Fir Accident : ఢిల్లీ షాపింగ్ కాంప్లెక్స్‌లో అగ్ని ప్రమాదం

TRINETHRAM NEWS

లిఫ్ట్‌లో చిక్కుకుని వ్యక్తి మృతి

ఢిల్లీ కరోల్ బాగ్‌లోని విశాల్ మెగా మార్ట్‌లో భారీ అగ్నిప్రమాదం

షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక అంచనా

అగ్నికీలలకు లక్షల రూపాయల విలువైన సరుకు దగ్ధం

13 ఫైరింజన్లతో మంటలను అదుపులోకి తెచ్చిన సిబ్బంది

Trinethram News : దేశ రాజధాని ఢిల్లీలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. కరోల్ బాగ్ ప్రాంతంలోని ప్రముఖ విశాల్ మెగా మార్ట్‌లో గత రాత్రి జరిగిన ఈ దుర్ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ప్రమాద సమయంలో లిఫ్ట్‌లో చిక్కుకుపోవడం వల్లే ఆయన మృతి చెందినట్లు అగ్నిమాపక శాఖ అధికారులు ధ్రువీకరించారు.

నిన్న సాయంత్రం 6:44 గంటల సమయంలో భవనంలోని మొదటి అంతస్తులో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. మొదట మాల్ సిబ్బంది అక్కడున్న అగ్నిమాపక పరికరాలతో మంటలను ఆర్పేందుకు ప్రయత్నించినప్పటికీ, అవి వేగంగా స్టోర్ మొత్తం వ్యాపించాయి. ఈ ప్రమాదంలో లక్షల రూపాయల విలువైన వస్తువులు, సరుకులు పూర్తిగా కాలి బూడిదయ్యాయి.

సమాచారం అందుకున్న వెంటనే ఢిల్లీ అగ్నిమాపక సిబ్బంది 13 ఫైరింజన్లతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఢిల్లీ పోలీసులు కూడా సహాయక చర్యల్లో పాలుపంచుకున్నారు. సుమారు రాత్రి 9 గంటల సమయానికి మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చారు. ప్రమాదం జరిగినప్పటికీ, ఇంకా భవనంలో వేడి తగ్గకపోవడంతో కూలింగ్ ప్రక్రియ కొనసాగుతోందని, ఆరు ఫైరింజన్లు ఘటనా స్థలంలోనే ఉన్నాయని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Fire breaks out in

You cannot copy content of this page

Scroll to Top