Surprise Inspection : లాడ్జిల ఆకస్మిక తనిఖీ

TRINETHRAM NEWS

వన్ టౌన్ ఎస్ఐ భూమేష్

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. పోలీస్ కమీషనర్ ఆదేశాల మేరకు మేరకు గోదావరిఖని 1 టౌన్ పరిధిలోని లాడ్జిలను పోలీసులు ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు గతం లో జరిగిన నేరా సంఘటనలను దృష్టిలో ఉంచుకొని, ఇతర రాష్ట్రల, జిల్లాల, ఇతర ప్రాంతల నుండి వచ్చి పగటి సమయంలో లో రెక్కి నిర్వహించి రాత్రి పూట నేరాలకు పాల్పడడం, చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలకు పాల్పడడం జరిగింది. అలాంటి నేరాలు నియంత్రణలో భాగంగా గోదావరిఖని 1 టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేన రెడ్డి ఉత్తర్వుల ప్రకారం ఎస్ఐ భూమేష్ ఆధ్వర్యంలో ఆకస్మిక తనిఖీ లు నిర్వహించడం జరిగింది.

లాడ్జి లో ఉన్న వారి వివరాలు పరిశీలించి, వారు ఉన్న గదిని క్షుణ్ణంగా తనిఖీ చేసి పలు సూచనలు చేశారు. లాడ్జి యాజమాన్యం ఎలాంటి ఆధారాలు లేకుండా ఎవ్వరికి రూమ్ లు ఇవ్వకూడదు. ఎవరైనా అనుమానస్పదంగా కనిపిస్తే వెంటనే పోలీస్ వారికీ సమాచారం అందించాలని సూచించారు. రికార్డుల నిర్వహణ పక్కాగా ఉండాలన్నారు. లాడ్జి పరిసరాలు స్పష్టంగా కన్పించేలా తప్పనిసరిగా సి. సి. కెమెరా ఏర్పాటు చేసుకోవాలని తెలియజేశారు. అనుమానాస్పదులు లాడ్జిల్లో బస చేసిన సమయంలో పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. లాడ్జిల్లో ఎలాంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన గట్టి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Surprise inspection of lodges

You cannot copy content of this page

Scroll to Top