Elon Musk : ఎలాన్ మస్క్ “ ది అమెరికా పార్టీ “

TRINETHRAM NEWS

Trinethram News : అమెరికాలో కొత్త పార్టీ పెట్టేందుకు ఎలాన్ మస్క్ సిద్ధమవుతున్నారు. ట్రంప్ ప్రభుత్వం ప్రతిపాదించిన “బిగ్ బ్యూటిఫుల్ బిల్” ఆమోదం లభించిన తర్వాత రోజే తాను పార్టీ పెడతానని ఆయన ప్రకటించారు. ఈ బిల్లు అమెరికాను దివాలా తీయిస్తుందని ఎలాన్ మస్క్ గట్టిగా నమ్ముతున్నారు. ఈ బిల్లును ప్రతిపాదించిన కారణంగానే ఆయన ట్రంప్‌కు గుడ్ బై చెప్పారు. అయితే రాజకీయాల్ని మాత్రం వదలడం లేదు. ఆ బిల్లుపై తన వ్యతిరేకత కొనసాగిస్తున్నారు.

ఈ బిల్లులో ప్రధానంగా ఎలక్ట్రిక్ వాహన సబ్సిడీల రద్దు అంశం ఉంది. ఇది టెస్లాను దెబ్బతీస్తుందని మస్క్ అనుకుంటున్నారు. అలాగే ఇతర క్లీన్ ఎనర్జీ, స్పేస్ ఎక్స్ వ్యాపారాలకూ ప్రోత్సాహకాలుతగ్గిపోతాయి. అలాగే అమెరికాపై రుణభారం పెరుగుతుందని ట్రంప్ అంటున్నారు. అందుకే ఎలాగైనా ఆ బిల్లును ఆపాలని ప్రయత్నిస్తున్నారు. కొత్త పార్టీ పెడతానని ట్రంప్ ను మస్క్ బెదిరిస్తున్నారు. గతంలో ట్రంప్ సొంత పార్టీపై ఎక్స్ లో పోల్ నిర్వహించారు. అందులో ఎనభై శాతం మంది కొత్త పార్టీ అవసరం ఉందన్నారు. ఆ తర్వాత, ఆయన ఈ పార్టీకి “ది అమెరికా పార్టీ” అనే పేరును ప్రతిపాదించారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Elon Musk “The America Party”

You cannot copy content of this page

Scroll to Top