భారత కార్మిక వర్గ హక్కులపై ప్రమాదకర దాడి చేయనున్న నాలుగు లేబర్ కోడ్లను ఉపసరించేంత వరకు ఐక్యంగా పోరాడుదాం!
ఐ. కృష్ణ. ఐ ఎఫ్ టీ యు రాష్ట్ర అధ్యక్షులు.
రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. భారత కార్మిక సంఘాల సమాఖ్య (IFTU) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు గోదావరిఖని ఐ ఎఫ్ టీ యు కార్యాలయం లో దేశ విదేసి కార్పొరేట్లు భారత కార్మిక వర్గంపై సాగిస్తున్న దోపిడీ అణిచివేతలను మరింత తీవ్రతరం చేయడానికి నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం గతంలో ఉన్న 29 కార్మిక చట్టాల స్థానంలో నాలుగు లేబర్ కోట్లను తీసుకువచ్చే ప్రక్రియను ప్రారంభించి ఐదు సంవత్సరాలకు పైగా అయిందని అన్నారు.
ఈ నాలుగు లేబర్ కోడ్స్ వలన జరిగే నష్టాలను వివరిస్తూ ఐ ఎఫ్ టీ యు జాతీయ కమిటీ ముద్రించిన బుక్ లేట్ ను ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఐ ఎఫ్ టి యు రాష్ట్ర అధ్యక్షులు ఐ కృష్ణ మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ కార్మిక వర్గం ఐక్యంగా సమరశీల పోరాటాలు నిర్వహించాలన్నారు.
బొగ్గు గని కార్మికుల హక్కుల కోసం కొత్త భూగర్భ జనుల సాధన కోసం ప్రభుత్వ రంగ సంస్థల రక్షణకై బొగ్గు బ్లాక్ ల ప్రైవేటీకరణ ఆపాలని కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్, స్కీం, వర్కర్ల క్రమబద్ధీకరణ కోసం కనీస వేతనం 26,000 ఇవ్వాలని 8. గంటల పని దినాన్ని పరిరక్షించాలని సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని అసంఘటిత రంగా కార్మికులందరికీ ఉద్యోగ భద్రత, పిఎఫ్, ఈఎస్ఐ, పెన్షన్ తదితర చట్టబద్ధ హక్కులు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ “జూలై 9న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో ” కార్మిక వర్గం పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఈ బుక్ లేట్ ఆవిష్కరణ కార్యక్రమంలో ఐ ఎఫ్ టి యు రాష్ట్ర కార్యదర్శి ఏ వెంకన్న,జిల్లా అధ్యక్షులు ఈ నరేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి బి అశోక్,నాయకులు ఐ రాజేశం, గుండేటి మల్లేశం, ఎం దుర్గయ్య,ఎం కొమరయ్య, ఎడ్ల రవికుమార్, సదానంద, వెంకటేష్, అఫ్జల్, మహేందర్. తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


