Vikram Chari’s Death : ఇంద్రోజ్ విక్రమ్ చారి మృతి బాధాకరం

TRINETHRAM NEWS

విద్యుత్ ఘాతంతో మృతి చెందిన విక్రమ్ చారి కుటుంబాన్ని ప్రభుత్వం పరంగా ఆదుకోవాలి
బిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు, మాజీ దేవరకొండ శాసన సభ్యులు రమావత్ రవీంద్ర కుమార్
దేవరకొండ జూలై 01 త్రినేత్రం న్యూస్. దేవరకొండ నియోజకవర్గంలోని గొట్టిముక్కల గ్రామానికి చెందిన ఇంద్రోజ్ విక్రమ్ చారి బాధాకరం అని బిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు, మాజీ దేవరకొండ శాసన సభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. మంగళవారం దేవరకొండ పట్టణంలో ప్రభుత్వ ఆసుపత్రిలో విద్యుత్ ఘాతంతో మృతి చెందిన విక్రమ్ చారి మృతదేహానికి నివాళులర్పించారు.

అనంతరం ఆయన కుటుంబ సభ్యులకు పరామర్శించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ….విద్యుత్ ఘాతంతో మృతి చెందిన విక్రమ్ చారి కుటుంబాన్ని ప్రభుత్వం పరంగా ఆదుకోవాలి ఆయన కోరారు.విక్రమ్ చారి మృతి పట్ల ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థించారు.ఆయన వెంట బిఆర్ఎస్ నాయకులు సోనగంటి గోవర్ధనాచారి, రామలింగం,మర్రు రామారావు,రమావత్ కొండల్ నాయక్, బొడ్డుపల్లి కృష్ణ,సిమర్ల కృష్ణ యాదవ్,వీరమల్ల వెంకటయ్య,సోనగంటి కొండల్ చారి, రమావత్ మాంత్య నాయక్,తదితరులు ఉన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Indroj Vikram Chari's death

You cannot copy content of this page

Scroll to Top