కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని బాచుపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో127 డివిజన్ గురుమూర్తి నగర్ వాసులు బిలంకంటి శక్తి కుమార్ గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతు నిమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుటకు ఆర్ధిక స్థోమత లేదు అని తెలుసుకున్న కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి వెంటనే స్పందించి గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు ద్వారా బాధితుడికి శస్త్ర చికిత్స నిమిత్తం రూ. 2,50,000/- ల సీఎం సహాయనిధి – ఎల్వోసీ ని మంజూరి చేయించారు.
రూ 2,50,000/- (రెండు లక్షల యాభై వెల రూపాయలు ) CMRF – LOC మంజూరి పత్రాలను శక్తి కుమార్ కి కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి అందజేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు అవిజె జేమ్స్, మాజీ కార్పొరేటర్ పల కృష్ణ, సిద్దనోళ్ల సంజీవ రెడ్డి, 127 డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బి . శివ కుమార్, బేకు శ్రీనివాస్, పండరి రావు, సంతోష్ ముదిరాజ్, ఎండి లాయక్, కొంపల్లి మున్సిపాలిటీ అధ్యక్షులు బైరి ప్రశాంత్ గౌడ్, సయ్యద్ షఫీ, సురేందర్ రెడ్డి, అజయ్, తులసి రెడ్డి మరియు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


