Anti-Drug Day యువత చెడు మార్గాల పట్ల ఆకర్షితం కాకుండా తల్లిదండ్రులు పర్యవేక్షించాలి

TRINETHRAM NEWS

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్: మాదక ద్రవ్యాల నియంత్రణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి చెడు అలవాట్ల వైపు ఆలోచన వస్తే తల్లిదండ్రులను గుర్తు చేసుకోవాలి అంతర్జాతీయ మాదకద్రవ్యాల నిర్మూలన దినోత్సవం సందర్భంగా వికారాబాద్ జిల్లా అవగాహన ర్యాలీ ని జిల్లా ఎస్పి నారాయణ రెడ్డి తో కలిసి ప్రారంభించిన జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ గురువారం జిల్లా యువజన క్రీడల శాఖ ,శిశు సంక్షేమ శాఖ, మరియు పోలీసు శాఖా ఆధ్వర్యంలో అంతర్జాతీయ మాదకద్రవ్యాల నిర్మూలన దినోత్సవం సందర్భంగా కలెక్టర్ ప్రతీక్ జైన్, జిల్లా ఎస్ పి తో కలిసి జిల్లా కేంద్రం ఎన్ టి ఆర్ చౌరస్తా నుండి బి జే ఆర్ చౌరస్తా వరకు నిర్వహించిన ర్యాలీని ప్రారంభించారు.
ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, యువత చెడు అలవాట్ల వైపు ఆకర్షితులైతే వచ్చే నష్టాలు, కుటుంబంలో మన తల్లిదండ్రులు, మన కుటుంబీకులు పొందే దుఃఖం అధికంగా ఉంటుందని, చెడు అలవాట్లకు మొదటి నుంచి దూరంగా ఉండాలని తెలిపారు. నేటి యువత రేపటి భావి భారత పౌరులని, వీరిలో కొంతమంది డ్రగ్స్ కు ఆకర్షితులైతే దేశ భవిష్యత్తు నాశనం అవుతుందని, దీనిని గుర్తించి డ్రగ్స్ వల్ల కలిగే విపరీత పరిణామాలపై అవగాహన పెంచుకొని దూరంగా ఉండాలని కలెక్టర్ సూచించారు. యువత డ్రగ్స్ తో పాటు, గుట్కా, గంజాయి, మాదక ద్రవ్యాలు, సిగరెట్ మొదలగు చెడు అలవాట్లకు సైతం దూరంగా ఉండాలని, చెడు అలవాట్ల వల్ల ఆరోగ్యం దెబ్బతింటుందని, ఆలోచనా విధానం ఆలోచన శక్తి నశిస్తాయని అన్నారు.
జిల్లా ఎస్ పి నారాయణ రెడ్డి మాట్లాడుతూ బారత దేశానికి యువత పట్టు కొమ్మ లాంటి వారని, యువత ఆరోగ్యంగా ఉన్నపుడే కుటుంబము ,దేశం బాగుపదుతుందని , విద్యార్థులకు చదువుతో పాటు సంస్కారం, క్రమశిక్షణ చాలా కీలకమని, వీటిని ఎట్టి పరిస్థితులలో కోల్పోవద్దని ఆయన పేర్కొన్నారు. తల్లిదండ్రులు పిల్లలు జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకునేందుకు తాము కష్టాలు పడుతూ పిల్లలకు మంచి సౌకర్యాలు కల్పిస్తారని, వాటిని ఎట్టి పరిస్థితుల్లో దుర్వినియోగం చేసుకోవద్దని, మాదక ద్రవ్యాలు వాడటం వల్ల చెడు జరుగుతుందని మన రాష్ట్ర ముఖ్య మంత్రి ,డి జి పి అసెంబ్లీ కేంద్రము నుండి మండల మరియు గ్రామ స్తాయీ వరకు తీసుకెళ్ళి యువతను చైతన్య పరచాలని అన్నారని తెలిపారు. మనం చెడు అలవాట్లకు గురైతే తల్లిదండ్రులు పడే క్షోభ వర్ణనాతీతమని, ఇది గుర్తుంచుకొని యువత మెలగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ సుదీర్, జిల్లా యువజన క్రీడల అధికారి మహమ్మద్ సత్తార్, శిశు సంక్షేమ అధికారి కృష్ణవేణి, జిల్లా అధికారులు ,పోలీస్, ఎక్సైజ్ శాఖ అధికారులు, విద్యార్థిని, విద్యార్థులు, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Parents should monitor the

You cannot copy content of this page

Scroll to Top