Trinethram News : హైదరాబాద్: రాష్ట్రంలో రూ.22వేల కోట్ల వ్యయంతో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపట్టామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. గాంధీభవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాల గురించి వివరించారు. “రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద రూ. 10లక్షల వరకు వైద్య సదుపాయం అందిస్తున్నాం. రూ.6వేల కోట్ల విలువైన 189 కోట్లు ఉచిత బస్సు టికెట్లు ఇచ్చాం. 93.7 లక్షల కుటుంబాలకు సన్నబియ్యం పంపిణీ చేస్తున్నాం. సంక్షేమ కార్యక్రమాలకు రూ.95,351 కోట్లు ఖర్చు చేస్తున్నాం” అని చెప్పారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


