డిండి (గుండ్లపల్లి) జూన్ 23 త్రినేత్రం న్యూస్. డిండిమండల పరిధిలో ఎర్రారం గ్రామంలో సోమవారం 23 న ఇందిరమ్మ ఇండ్ల పనులు ప్రారంభించడం జరిగింది .ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు బొడ్డుపల్లి లక్ష్మయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో పేద ప్రజల సొంతింటి కల నెరవేర్చుటకై ఇందిరమ్మ ఇండ్ల పథకం కాంగ్రెస్ ప్రభుత్వం సంవత్సరం ఆరు నెలలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు పేదలకు సన్న బియ్యం మరియు ఇందిరమ్మ ఇండ్లు ఉచిత బస్సు ప్రయాణం 10 లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ 200 యూనిట్ల ఉచిత కరెంటు 500 కే గ్యాస్ సిలిండర్ రైతు భరోసా రైతు రుణమాఫీ రైతు పండించిన పంటలకు మద్దతు ధర 500 బోనస్ గత ప్రభుత్వం కొనసాగించిన సంక్షేమ పథకాలను కొనసాగిస్తూ ఇలా ఎన్నో సంక్షేమ పథకాలను ఇస్తున్న ప్రభుత్వం ప్రజల కలలు నెరవేర్చే ప్రజా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో చీమర్ల చిన్న ఇద్దయ్య షకీల్ బాబా అక్రమ్ రషీద్ ,పంచాయతీ కార్యదర్శి హరి ,గోరటి సాయికుమార్ అరవిందు సాయిలు జాంగిర్ బాబా ,సలాం ,మల్లయ్య నసీం ,జానీ ,జంగయ్య మరియు ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


