జూన్ 26, 2026
TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం. దమ్మపేట విశాల సహకార పరమితి సంఘం ఆధ్వర్యంలో దమ్మపేట సొసైటీ కార్యాలయంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో గౌరవ ఎమ్మెల్యే జారె ఆదినారాయణ ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు భరోసా పథకం కింద వేలాది మంది రైతుల ఖాతాల్లో పెట్టుబడి సహాయం నేరుగా జమ చేయడం పట్ల హార్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి కి ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకి ఉమ్మడి ఖమ్మంజిల్లా మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కి, తుమ్మల నాగేశ్వరరావు కి అశ్వారావుపేట నియోజకవర్గ రైతుల తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపి వారి చిత్రపటాలతో పాటుగా కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకుల చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో మాజీ మండల అధ్యక్షులు మద్దిశెట్టి సత్యప్రసాద్, సొసైటీ చైర్మన్ ఎళ్లిన రాఘవరావు, మార్కెట్ కమిటీ చైర్మన్ వాసం రాణి, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు కాకా రమేష్, ఆయిల్ ఫామ్ కమిటీ అడ్వైజర్ మెంబర్ ఆలపాటి శ్రీరామచంద్ర ప్రసాద్, జిల్లా అధిక కమిటీ సభ్యురాలు సొంగా ఏసుమణి, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు అభిమానులు రైతు సంఘాల నాయకులు సొసైటీ డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

MLA Jare thanked the

You cannot copy content of this page