High Court : న్యాయస్థానం చేసే పని కూడా పోలీసులే చేస్తారా ?

TRINETHRAM NEWS

పోలీసులు శాంతి భద్రతల కంటే సివిల్ విషయాల్లోనే ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు

సివిల్ విషయాల్లో జోక్యం చేసుకుంటున్న పోలీసుల పట్ల హైకోర్టు సీరియస్

Trinethram News : హైదరాబాద్ – బార్కస్ ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి ఇంటి స్థలంపై హైకోర్టులో పిటిషన్ వేయగా, ఆ పిటిషన్ ను వెనక్కి తీసుకోవాలని బాధితుడిని బెదిరించిన పోలీసులు .. దీంతో పోలీసులు బెదిరిస్తున్నారని హైకోర్టును ఆశ్రయించిన బాధితుడు .. బాధితుడు ఫిర్యాదు మేరకు విచారణ జరిపి, పోలీసులపై తీవ్రంగా మండిపడ్డ హైకోర్టు

శాంతి భద్రతలకంటే సివిల్ విషయాల్లోనే ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు ఎందుకు ? హైకోర్టులో ఉన్న పిటిషన్ ను వెనక్కి తీసుకోమని చెప్పడానికి మీరెవరు ? అంటూ పోలీసుల పట్ల ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు ధర్మాసనం

ఎన్ని సార్లు చెప్పినా మీరు మారరా ? ఎండలో ఫిర్యాదు చేయడానికి వచ్చిన వారికి పోలీస్ స్టేషన్లో కనీసం మంచి నీళ్ళు కూడా ఇవ్వరు, స్టేషనరీ కూడా ఫిర్యాదుదారుడే తెచ్చుకోవాలని చెప్తున్నారని పోలీసులపై మండిపడ్డ హైకోర్టు

ఇకనైనా పోలీసులు తమ వైఖరి మార్చుకోవాలని, బాధితుడిని బెదిరించిన పోలీసులపై విచారణ జరపాలని ఆదేశించిన హైకోర్టు .. న్యాయస్థానాలు చేసే పని చేయడానికి ప్రయత్నించడం ఆపేయాలని, సివిల్ విషయాల్లో జోక్యం చేసుకోవద్దని పోలీసులను హెచ్చరించిన హైకోర్టు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Will the police also

You cannot copy content of this page

Scroll to Top