International Father’s Day : దేవరకొండ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ ఫాదర్స్ డే వేడుకలు

TRINETHRAM NEWS

దేవరకొండ జూన్ 15 త్రినేత్రం న్యూస్. వీర వృద్ధాశ్రమం నందు ఆదివారం అధ్యక్షుడు NVT, కొంగరి మధు, DSA ఫోటోగ్రాఫర్ నరేష్, సభ్యులతో కలిసి కేక్ కట్ చేసి అంతర్జాతీయ ఫాదర్స్ డే శుభాకాంక్షలు తెలియజేసి, ఫ్రూట్స్, బిస్కెట్స్ అందజేసినారు. అనంతరం అధ్యక్షుడు NVT మాట్లాడుతూ, పిల్లల పట్ల తండ్రికి ఉండే ప్రేమ అమితమైనదని, దానికి విలువ కట్టలేమని అన్నారు. ప్రతి తండ్రి పిల్లలకు ఎప్పుడూ బెస్ట్ ఇవ్వాలని తాపాత్రయ పడుతూ ఉంటాడని ఆయన అన్నారు. సమాజం ఏ దశలో ఉన్నా తండ్రికి, పిల్లలకు ఉండే ఆ మధురిమ మారదు అన్నారు.

ఆయన మాట్లాడుతున్న సమయం లో ఓ వృద్ధుడు ఆయన్ను గుర్తించి బిడ్డా nvt బాగున్నావా? నేను నీకు గుర్తున్నానా అనగానే… పేరు తో సహా చెప్పడం తో ఆ వృద్ధుడు కంటి నిండా నీళ్ళు చెమర్చడం తో nvt ఆయన్ను హత్తుకుని ఓదార్చారు. వారిద్దరూ బావోద్వాగానికి గురయ్యారు. ఆ సందర్భం లో మిగతా వృద్ధులు కంటతడి పెట్టారు. ఈ కార్యక్రమం లో వీర, వృద్ధాశ్రమ నిర్వాహకులు రుత్విక్, షీలా,మణి, కీర్తీ, వీరబాబు,వీరాంజనేయులు,వెంకటేశ్వర్లు, వితిన్, రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

International Father's Day celebrations

You cannot copy content of this page

Scroll to Top