MD Rashid : మైనారిటీలకు స‌ముచిత స్థానం ఇవ్వ‌ని మంత్రి వర్గ విస్తరణ

TRINETHRAM NEWS

డిండి( గుండ్లపల్లి) జూన్ 09 త్రినేత్రం న్యూస్.
MD రషీద్ డిండి టౌన్ బి ఆర్ ఎస్ పార్టీ యూత్ ప్రెసిడెంట్ ….

కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఇటీవల చేపట్టిన మంత్రి వర్గ విస్తరణలో మైనారిటీల‌కు స‌ముచిత స్థానం ద‌క్క‌లేద‌ని డిండి టౌన్ బి ఆర్ ఎస్ పార్టీ యూత్ అధ్యక్షులు MD రషీద్ అన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మైనారిటీల కోసం ఏ ఒక్క పథకం కూడా ప్రవేశ పెట్టలేదన్నారు. మైనారిటీ మహిళల కోసం ఉచిత కుట్టు మిషన్లు పొందేందుకు దరఖాస్తు స్వీకరించి 10 నెలలు గడిచినా నేటివరకు లబ్దిదారుల ఎంపిక జరగలేదన్నారు. షాదీ ముబారక్ పథకానికి దరఖాస్తు చేసుకున్న లబ్దిదారులకు సంవత్సరం దాటిన చెక్కులు అందటం లేదని, సీఎం ఓవర్సీస్ ఉపకార వేతనాలకు ధరఖాస్తు చేసుకున్న విద్యార్దులకు కోర్సు ముగిసినప్పటికీ ఉపకార వేతనాలు అందక విద్యార్దులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న‌ట్లు తెలిపారు.

అదేవిధంగా పెండింగ్‌లో ఉన్న పోస్ట్ మెట్రిక్ స్కాల‌ర్‌షిప్ విడుదలకు మోక్షం కలగటంలేదని, మైనారిటీ గురుకుల డిగ్రీ కళాశాల, మైనారిటీ స్టడీ సర్కిళ్లు అందని ద్రాక్షగానే మిగిలాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపు రెండు సంవత్సరాలు కావొస్తున్న మైనారిటి శాఖకు మంత్రిని కేటాయించలేదని, తద్వారా మైనారిటీ సమస్యలు ఆలకించే నాథుడే కరువయ్యాడన్నారు. మైనారిటీ సంక్షేమ శాఖకు నేటివరకు ఐఏఎస్ హోదా కలిగిన అధికారి లేడని, కామారెడ్డి మైనారిటీ డిక్లరేషన్ కలగానే మిగిలిందన్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి మైనారిటీ సమస్యల పట్ల దృష్టి సారించి మైనారిటీలకు అండగా నిలువాలని ఆవేదన వ్యక్తం చేశారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

The expansion of the

You cannot copy content of this page

Scroll to Top