Ketavath Babu Ram Naik : బార్ రెస్టారెంట్, ఫంక్షన్ హాల్ మధ్యన కార్పొరేట్ స్కూల్

TRINETHRAM NEWS

పట్టించుకోని విద్యాశాఖ అధికారులు.
గిరిజన ఎస్ టి, ఎస్ సి,బీసీ,మైనార్టీ విద్యార్థులు మోసపోకుండా న్యాయం చేయాలి.
తెలంగాణ గిరిజన సంస్కృతి పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు : కేతావత్ బాబు రామ్ నాయక్……
దేవరకొండ జూన్ 09 త్రినేత్రం న్యూస్. దేవరకొండ పట్టణంలో ముదిగొండ రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేస్తున్న తెలంగాణ ఖమ్మం శ్రీ చైతన్య టెక్నో కార్పొరేట్ స్కూల్ నిబంధనలకు విరుద్ధంగా వరుణ్ కృష్ణ బార్ అండ్ రెస్టారెంట్ మరియు సాయి రమ్య ఫంక్షన్ హాల్ ఈ రెండింటి మధ్యలో ఏర్పాటు చేశారు. తెలంగాణ ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఇట్టి పాఠశాల యజమాన్యం ప్రజలను శ్రీ చైతన్య టెక్నో స్కూల్ అంటూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు.
ఈ విషయమై స్థానిక ఎంఈఓ గారు ఇంత జరుగుతున్న కనీసం పట్టించుకోవడం లేదు స్కూలు కనీసం వంద మీటర్ల దూరం కూడా లేదు యజమానిపై ఎన్ యు గారు ఎలాంటి చర్యలు తీసుకోకుండా చోద్యం చూస్తున్నారు అని ఇప్పటికైనా అధికారులు మద్దూ నిద్రలో నుంచి మేలుకొని తక్షణమే ప్రతి స్కూలు యజమాన్యంపై చర్యలు తీసుకుని గిరిజన ఎస్టి విద్యార్థులకు మరియు ఎస్సీ బీసీ మైనార్టీ విద్యార్థులు మోసపోకుండా న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నామని బాబురావు నాయక్ అన్నారు. లేనియెడల విద్యాశాఖ కమిషనర్ దృష్టికి తీసుకువెళ్తామని ఈ సందర్భంగా విద్యాశాఖ అధికారులను హెచ్చరించారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Corporate school in the

You cannot copy content of this page

Scroll to Top